Karan Johar blames Aamir Khan for Bollywood's woes
mictv telugu

బాలీవుడ్ దుస్థితికి కారణం ఆమిర్ ఖానే : కరణ్ జోహార్

August 4, 2022

బాలీవుడ్ సినిమాల కంటే దక్షిణాది సినిమాలే గతేడాదిగా దేశవ్యాప్తంగా భారీ విజయాలు నమోదు చేస్తున్నాయి. దీనికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పగా, తాజాగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ మాత్రం అమీర్ ఖానే కారణమని తేల్చి చెప్పారు. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న అమీర్‌తో కరణ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, పుష్ప చిత్రాలు రికార్డు విజయాలు సాధించగా, మన చిత్రాలు సరిగా ఆడలేదు. మన వద్ద ఎక్కువగా కనిపించే ఆ టోనాలిటీని ఆయా సినిమాల్లో కనిపించాయి. దానిని మనం కోల్పోవడానికి కారణం మీరే. దిల్ చాహతా హై, లగాన్, రంగ్ దే బసంతి, తారే జమీన్ పర్ వంటి సినిమాలతో నిర్దిష్టమైన ప్రేక్షకులను, ఫిల్మ్ మేకర్లను మీరు సృష్టించారు’ అని అన్నారు. దానికి బదులుగా ‘మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. నేను తీసిన సినిమాలన్నీ హృదయాలకు హత్తుకునేవి. అవి మామూలు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాయి. దేశంలో ఎక్కువ మంది ఆసక్తి చూపని సినిమాలు తీస్తే అవి ఎలా సక్సెస్ అవుతాయి. ఈ లోపాన్ని మనలో చాలా మంది గుర్తించడం లేదు’ అని వివరించారు. కాగా, అమీర్ తాజాగా నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఇందులో కరీనాకపూర్ కథానాయిక.