వివాహబంధంతో ఒక్కటైన బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణ్బీర్ కపూర్ తల్లిదండ్రులు కాబోతున్నారు. అలియా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపడంతో.. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ జంటకి విషెస్ తెలిపారు. వారిలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్.. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అలియా 17 ఏండ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి తాను చూస్తున్నానని, కూతురు లాంటి అలియా మరో చిన్న పాపకు జన్మనిచ్చేందుకు సిద్ధమవ్వడం చూసి భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు. నేను అమ్మాయిలా ఉన్న తను గొప్ప నటిగా, ఇప్పుడు ఓ తల్లిగా మారడం చూస్తున్న తాను ఏడుపు ఆపుకోలేకపోయానని చెప్పారు.
అదే విషయాన్ని అలియాకి చెప్పానని, తను వచ్చి నన్ను కౌగిలించుకుని సముదాయించిందన్నారు కరణ్ జోహార్ . నిజానికి అలియానే తన మొదటి బిడ్డ అని చెప్పారు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్’ అనే సినిమాతోనే అలియా ఇండస్ట్రీకి పరిచయమైంది. అప్పటి నుంచి వారిమధ్య మంచి బంధం ఉంది. అలియాకి సంబంధించిన ప్రతి విషయాన్ని కరణ్ సెలబ్రేట్ చేస్తూ వస్తున్నాడు.