Karan Johar is angry about the remuneration of heroes in bollywood
mictv telugu

5 కోట్లు తెచ్చే సత్తా లేదు కానీ 20 కోట్లు అడుగుతారు – హీరోలపై నిర్మాత ఫైర్

January 5, 2023

బాలీవుడ్‌లో పెరిగిపోతున్న హీరోల పారితోషికంపై నిర్మాత కరణ్ జోహార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా రిలీజైన మొదటి రోజు రూ. 5 కోట్ల వసూలు చేసే సామర్ధ్యం ఉండదు కానీ పారితోషికంగా మాత్రం రూ. 20 కోట్లు కావాలని ఎద్దేవా చేశారు. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలైనా పేరుకు హిట్ కానీ డబ్బులు మాత్రం రావని తెలిపారు. యశ్ చోప్రా చెప్పినట్టు సినిమా హిట్టా ఫెయిలా అనేది దానికి పెట్టే బడ్జెట్ నిర్ణయిస్తుందని వెల్లడించారు. తాను నిర్మించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఇది రుజువైందన్నారు. ఈ సినిమాతో అలియాభట్, వరుణ్ ధావన్, సిద్ధార్ధ్ మల్హోత్రాలను పరిచయం చేసి హిట్ కొట్టాను కానీ డబ్బులు రావడం కాదు కానీ ఉన్నవి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా పరంగా చూస్తే బాలీవుడ్ తనకు ఇష్టమని, కానీ ఓ వ్యాపారిగా చూస్తే మాత్రం తెలుగు పరిశ్రమనే ఎక్కువ లాభదాయకంగా ఉంటుందని ప్రశంసించారు. నిజాలు మాట్లాడినందుకు తనను హత్య చేస్తారేమో కానీ ఇదే నిజమంటూ కుండబద్ధలు కొట్టారు. దీనికి కొందరు నెటిజన్లు నిజమే చెప్పాడు కదా అని కామెంట్ చేస్తున్నారు.