‘ఏ మహిళతో ఎఫైర్ లేకపోతే గే అంటారా నన్ను’ - బాలీవుడ్ నిర్మాత - MicTv.in - Telugu News
mictv telugu

‘ఏ మహిళతో ఎఫైర్ లేకపోతే గే అంటారా నన్ను’ – బాలీవుడ్ నిర్మాత

June 25, 2022

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తనకు, షారూఖ్ ఖాన్ మధ్య ఉన్న సంబంధంపై క్లారిటీ ఇచ్చాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో అనేక సూపర్ హిట్ సినిమాలు రాగా, వీరిద్దరి మధ్య శారీరక సంబంధం ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అందుకే కరణ్ జోహార్ ఏ మహిళతోనూ కనీసం లవ్, ఎఫైర్ వంటివి పెట్టుకోవట్లేదని రూమర్లు వచ్చాయి. ఓ యాంకర్ అయితే కరణ్ ముఖం మీదనే అడిగేసింది. వీటిన్నింటికీ సమాధానం తను తాజాగా రాసిన బుక్కులో ఇచ్చే ప్రయత్నం చేశాడు. యాన్ అన్‌సూటబుల్ బాయ్ అనే పుస్తకంలో తను పడిన బాధ అంతా ఎమోషనల్‌గా వెల్లడించాడు. ‘జీవితంలో ఎన్నో విమర్శలు వస్తుంటాయి. కానీ, షారూఖ్‌తో ఎఫైర్ అన్న మాట మాత్రం నా గుండెలను పిండేసింది. ఓ యాంకర్ కూడా అందరిముందు ఈ ప్రశ్న వేశాడు. నాకు వెంటనే చాలా కోపం వచ్చి నీ అన్నతో నువ్వు పడుకున్నావా? అని నేను నిన్ను అడిగితే నీకెలా ఉంటుంది? అని తిరిగి ప్రశ్నించా. షారూఖ్ నాకు అన్నలాంటి వాడు. అండగా ఉంటాడు. అయినా ఒక వ్యక్తి మహిళతో సెక్స్ సంబంధం పెట్టుకోకుంటే అతడు గే అని డిసైడ్ చేసేస్తారా? అంటూ తన ఆవేదనను పంచుకున్నాడు.