బాలీవుడ్ దర్శకుడి ఇంట్లో కరోనా పాజిటివ్  - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్ దర్శకుడి ఇంట్లో కరోనా పాజిటివ్ 

May 26, 2020

vgbn vbn

బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇటీవల బోనికపూర్ ఇంట్లో పని చేసే వారికి పాజిటివ్ అని తేలగా.. తాజాగా మరో ప్రముఖుడి ఇంట్లో తేలింది. దర్శకుడు కరణ్ జోహార్ ఇంట్లో పని చేసే ఇద్దరికి వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. వారికి  కావాల్సిన వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. వారిని ఐసోలేషన్‌కు తరలించిగా.. కరణ్ ఫ్యామిలి హోం క్వారంటైన్ ఉన్నట్టుగా వెల్లడించారు. వరుస ఘటనలతో బాలీవుడ్ ప్రముఖుల్లో కరోనా కలవరం మొదలైంది. 

ఇటీవల ఆయన నివాసంలో పని చేసే వారికి అనారోగ్యంతో పాటు కరోనా లక్షణాలు కనిపించాయి. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరీక్షలు జరిపారు. కరోనా సోకినట్టు తేలడంతో ఐసోలేషన్‌కు తరలించారు. ఆ తర్వాత తన నివాస ప్రాంగణం అంతా రసాయనాలతో శుద్ది చేశారు. తమ కుటుంబ సభ్యులకు ఎవరికి కరోనా లక్షణాలు లేవని కరణ్ తెలిపాడు. అందరికి పరీక్షలు జరపగా.. నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. అయినప్పటికీ నిబంధనల ప్రకారం 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటామని తెలిపాడు.