KARATE KALAYANI COMPLAINTS ON DEVISRIPRSAD
mictv telugu

దేవి శ్రీ ప్రసాద్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు

November 2, 2022

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన రూపొందించిన ‘ఓ పారి’ సాంగ్ పై దుమారం రేగుతోంది. ఆ ఆల్బమ్ లో ‘హరే రామ హరే కృష్ణ’ మంత్రాన్ని ఐటెం సాంగ్‌లో చిత్రీకరించారని నటి కరాటే కల్యాణి పోలీసులను ఆశ్రయించారు. పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రంపై అశ్లీల దుస్తులు, నృత్యాలతో పాటను చిత్రీకరించారని మండిపడ్డారు. దేవి శ్రీ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని..హిందూ సంఘాలతో కలిసి హైదరాబాద్ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన దేవిశ్రీ ప్రసాద్ క్షమాపణ చెప్పడంతో పాటు..పాటలోని ఆ పదాలను తొలగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.