కరాటే కల్యాణి దత్తత వివాదం.. అధికారుల సోదాలు - MicTv.in - Telugu News
mictv telugu

కరాటే కల్యాణి దత్తత వివాదం.. అధికారుల సోదాలు

May 16, 2022

 

యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని నడిరోడ్డుపై కొట్టి ఇటీవల వార్తల్లోకెక్కిన నటి కరాటే కల్యాణి మెడకి మరో వివాదం చుట్టుకొంది. అక్రమంగా ఓ పాపను దత్తత తీసుకుందంటూ ఫిర్యాదు రావడంతో అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కరాటే కల్యాణి అక్రమంగా ఓ పాపను దత్తత తీసుకున్నారంటూ 1098 నంబరుకు ఓ ఫిర్యాదు వచ్చింది. దాంతో చైల్డ్‌లైన్ అధికారులు పోలీసుల సహాయంతో హైదరాబాదులోని ఆమె నివాసానికి చేరుకొని సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో కరాటే కల్యాణి, పాప ఇద్దరూ ఇంట్లో లేకపోవడంతో ఆమె తల్లి విజయలక్ష్మి, సోదరుడిని విచారిస్తున్నారు. అయితే నగరంలోని ఓ జంట మూడోసారి ఆడ శివువుకు జన్మనిచ్చిందని, తెలిసిన వ్యక్తుల ద్వారా ఆ పాపను కల్యాణి చట్టపరంగా దత్తత తీసుకుని పెంచుకుంటోందని విజయలక్ష్మి అధికారులకు వెల్లడించారు. కాగా, తనపై దాడి చేసిన కరాటే కల్యాణి వల్ల తనకు ప్రాణహాని ఉన్నట్టు యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.