ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి యూట్యూబ్‌లో ఫ్రాంక్ వీడియోలు చేసే శ్రీకాంత్ రెడ్డిని రోడ్డుపై చితకబాదింది. ఎస్సార్‌నగర్ పరిధిలోని మధురానగర్‌లో నడిరోడ్డుపై అతడిపై దాడి చేసింది. ఫ్రాంక్ వీడియోలు చేసే శ్రీకాంత్ రెడ్డి వీడియోలకు మంచి ఆదరణ ఉంది.
అయితే ఫ్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణతో గురువారం కరాటే కల్యాణి శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లింది. అసభ్యకర వీడియోలపై అతడిని నిలదీసింది. ప్రవర్తన సరికాదని, మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా, ఇద్దరూ పోలీస్ స్టేషనకు వెళ్లి ఒకరిపై మరొకరు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.