డబ్బులిస్తా, చేస్తావా అని అడిగాడు.. కరాటే కళ్యాణి - MicTv.in - Telugu News
mictv telugu

డబ్బులిస్తా, చేస్తావా అని అడిగాడు.. కరాటే కళ్యాణి

May 13, 2022

యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి, నటి కళ్యాణిల మధ్య వాగ్వాదం హాట్ టాపిక్ గా మారింది. ప్రాంక్‌ వీడియోల పేరుతో యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, అదే విషయాన్ని అడిగినందుకు వెళ్లిన తనను కూడా నీచంగా మాట్లాడాడని కళ్యాణి ఆరోపిస్తున్నారు. అందుకే తనపై చేయి చేసుకున్నానని ఆమె చెబుతున్నారు.

నిన్న రాత్రి మధురానగర్‌లో నడిరోడ్డుపై శ్రీకాంత్‌రెడ్డిని కరాటే కల్యాణి చితకబాదిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకోవడం, ఇరువురు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. తాజాగా ఈ వివాదంపై నటి కరాటే కల్యాణి స్పందించారు. వీడియోల పేరుతో శ్రీకాంత్‌ రెడ్డి ఇ‍ష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని, గతంలోనూ అమ్మాయిలను వేధించాడని ఆరోపించారు.
‘బిగ్‌బాస్‌లో ఛాన్స్‌ ఇప్పిస్తా, యూట్యూబ్‌ స్టార్స్‌ని చేస్తా అని అమ్మాయిలను ట్రాప్‌ చేస్తాడు. ఈ విషయంపై మాట్లాడేందుకు వెళ్తే నాతోనూ అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బులిస్తాను.. నాతో కలిసి అడల్ట్‌ కంటెంట్‌ చేస్తావా? అని అడిగాడు. ఆ మాటకి కోపం వచ్చి చెంప పగలకొట్టాను అని కరాటే కల్యాణి అన్నారు. అతడి యూట్యూబ్ చానెల్ ను బ్యాన్ చేయాలని డిమాండ్‌ చేశారు.