రూ. 700లకే ఫోన్.. మీరు ఓ లుక్కేయండి - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 700లకే ఫోన్.. మీరు ఓ లుక్కేయండి

August 11, 2019

Karbon Lunch New Mobile..

అతి తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్స్ మొబైల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది దేశీయ  సంస్థ కార్బన్ సంస్థ. కేవలం రూ. 700లకే మార్కెట్లోకి సరికొత్త ఫోన్లు తీసుకువచ్చారు.కార్బన్ కేఎక్స్3,కేఎక్స్25,కేఎక్స్26 సిరీస్ ఫోన్లు లాంఛ్ చేసింది. అతి తక్కువ ధరలతో కస్టమర్లకు మంచి సేవలు అందించడమే లక్ష్యమని ఆ సంస్థ పేర్కొంది.

ఈ ఫోన్లో 1.7 అంగుళాల స్క్రీన్, 800ఎంహెచ్ బ్యాటరీ, రేడియో,వీడియో, మ్యూజిక్ ప్లేయర్,  పవర్ సేవింగ్ మూడ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మూడు సిరీస్ ఫోన్ల ధర రూ. 700 నుంచి రూ.1000 మధ్యలో ఉంది. కేఎక్స్25 ఫోన్‌లో 1,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 2.4 అంగుళాల స్క్రీన్, ఎఫ్ఎం రేడియో, డ్యూయెల్ సిమ్, ఎల్ఈడీ టార్చ్, డిజిటల్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. చైనా ఫోన్ల దాటికి తట్టుకోలేక కార్బన్ సంస్థ కొన్ని రోజులుగా ఒడిదుడులు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది.