ప్రణయ్ హత్య కేసు నిందితుడు కౌన్సిలర్‌గా నామినేషన్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రణయ్ హత్య కేసు నిందితుడు కౌన్సిలర్‌గా నామినేషన్

January 12, 2020

Kareem nomination.

2018 సెప్టెంబర్‌లో ప్రణయ్ పరువుహత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నల్లగొండ జిల్లా మిర్యాలగుడాలో కులాంతర వివాహం చేసుకున్నందుకు ప్రణయ్‌ని అతడి భార్య అమృత తండ్రి మారుతీరావు దారుణంగా హత్య చేయించాడు. ప్రణయ్‌ హత్య జరిగిన సమయంలో అమృత ఏడు నెలల గర్భవతి కావడం గమనార్హం. 

ప్రణయ్ హత్య కేసులో విచారణ ఎదుర్కుంటున్న నిందితులు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. వీరిలో ఒకరైన ఎంఏ కరీం త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా నామినేషన్ వేయడం వివాదాస్పదం అవుతోంది. ప్రణయ్ హత్య కేసులో కరీం ఐదో నిందితుడు (ఏ-5). అతను రెండు రోజుల క్రితం కౌన్సిలర్‌గా నామినేషన్ వేశాడు. కరీం గతంలో కాంగ్రెస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ బీ ఫారం ఇవ్వకపోయినా మిర్యాలగుడాలోని 20, 21 వార్డుల నుంచి అతను స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్‌గా బరిలో నిలిచాడు. కరీం మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.