బాలీవుడ్‌కు మన జేజమ్మ.. కరీనా మెప్పిస్తుందా! - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్‌కు మన జేజమ్మ.. కరీనా మెప్పిస్తుందా!

September 22, 2019

Arundhati

పదేళ్ల క్రితం వచ్చిన ‘అరుంధతి’ సినిమా టాలీవుడ్‌లో ఎంతపెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అనుష్క ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటివరకు చిన్న హీరోయిన్‌గా వున్న అనుష్క ఈ సినిమాతో తన రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసింది. దివంగత దర్శకుడు కోడిరామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించారు. సోనూసూద్ నటుడిగా ఈ సినిమాతో చాలా బిజీ అయిపోయాడు. అయితే ఈ సినిమాను ఎప్పటినుంచో హిందీలో రీమేక్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. కానీ, అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌తో బాలీవుడ్ చూపు తెలుగు సినిమాలపై పడింది. 

అనుష్క పాత్ర కోసం కరీనా కపూర్‌‌‌‌ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆమె కాదంటే మరో ఆప్షన్‌గా అనుష్కా శర్మను తీసుకుంటారని తెలుస్తోంది. కరీనా అయితేనే ఆ పాత్రకు న్యాయం చేయగలదని భావిస్తున్నారట చిత్ర దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమాను హిందీలో ఎవరు నిర్మిస్తున్నారు, ఎవరు దర్శకత్వం వహిస్తున్నది తెలియాల్సి వుంది.