Kareena Kapoor's ex-husband Shahid Kapoor.. Karan Johar's sister
mictv telugu

కరీనా కపూర్ మాజీ భర్త షాహిద్ కపూర్..కరణ్ జోహార్ తీట

August 5, 2022

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు, ‘కాఫీ విత్ కరణ్ షో’ వ్యాఖ్యాత కరణ్ జోహార్ మరోసారి టంగ్ స్లిప్‌య్యాడు. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌ని కరీనాకపూర్ మాజీ భర్తగా సంబోధించాడు. వెంటనే నాలుక్కర్చుకొని, స్టేజ్‌పైనే ఆమెకు క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియోను వీక్షిస్తున్న షాహిద్ కపూర్‌, కరీనాకపూర్ అభిమానులు కరణ్ జోహార్‌పై మండిపడుతూ.. ”కరణ్‌ నీకూ ఏం పనిలేదా? ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి ఎందుకు తలదూరుస్తున్నావు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వీడియోలో.. ‘కాఫీ విత్ కరణ్ షోలో “లాల్‌సెంగ్ చడా’ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు కరీనా, ఆమిర్‌ఖాన్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా వీరిద్దరి వ్యక్తిగత జీవితాలను తెలుసుకునేందుకు కరణ్ ప్రయత్నం చేశారు. ”బేబి ఈ షోలో నువ్వు ఇప్పటికే ఎన్నోసార్లు పాల్గొన్నావు. ఎన్నో విశేషాలు పంచుకున్నావు. ఒక నటిగా ఈ స్టేజ్‌పై సందడి చేశావు. నీ భర్త సైఫ్‌తో ఓసారి మెరిశావు. ఇక, మాజీ భర్తతో కూడా” అంటూ ఏదో చెప్పబోయి, వెంటనే తప్పు తెలుసుకుని”క్షమించండి. మాజీ భర్త కాదు. మాజీ ప్రియుడితో ఈ షోకి వచ్చావు. ఇలా ఎన్నోసార్లు ఈ సెట్‌లోకి అడుగు పెట్టావు” అని ఆయన అన్నారు.

అనంతరం షాహిద్ కపూర్‌ని తన మాజీ భర్తగా సంబోధించగానే..కరీనా ఒక్కసారి షాకయ్యారు. తర్వాత కరణ్ మళ్లీ ఓ ప్రశ్న వేశారు.. “రణ్‌బీర్, షాహిద్ కపూర్.. వీరిద్దరిలో ఎవరు వారి పార్టీకి మిమ్మల్ని ఆహ్వానించరు” అని అడుగగా దానిక కరీనా.. “రణ్‌బీర్ నన్ను ఎందుకు పిలవకుండా ఉంటాడు. నాకు తెలిసినంత వరకూ షాహిద్ నన్ను ఆహ్వానించకపోవచ్చు” అని జవాబిచ్చారు.