Karim Benzema Retired From International Football After Argetina Defeat France
mictv telugu

రిటైర్‌మెంట్ ప్రకటించిన ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ప్లేయర్

December 20, 2022

Karim Benzema retires from international football after France's defeat to Argentina

ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్, స్ట్రయికర్‌ కరీమ్‌ బెంజమా(36) అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. సోమవారం రాత్రి తన ట్విటర్‌లో బెంజమా రిటైర్మెంట్‌ విషయాన్ని పేర్కొన్నాడు. ఆదివారం ఖతర్‌ వేదికగా జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ పెనాల్టీ షూటౌట్‌లో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బెంజమా తన ట్విటర్‌లో స్పందించాడు. ”ఫ్రాన్స్‌ ఓటమి నన్ను బాధించింది.. ఫిట్‌నెస్‌, ఇతర కారణాల రీత్యా అంతర్జాతీయ కెరీర్‌ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా.. ఇన్నాళ్లు ఫ్రాన్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. నాపై ప్రేమను చూపించిన అభిమానులందరికి కృతజ‍్క్షతలు. ఫిఫా వరల్డ్‌కప్‌ లేకుండానే రిటైర్మెంట్‌ ఇవ్వడం బాధ కలిగిస్తుంది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు.. అందుకే గుడ్‌బై చెప్పేశా” అంటూ పేర్కొన్నాడు.

బెంజెమా సోమవారమే తన 36వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఇలా పుట్టినరోజు నాడే రిటైర్మెంట్‌ ప్రకటించి తన అభిమానులను షాక్‌కు గురిచేశాడు. 2007లో ఫ్రాన్స్‌ తరఫున అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన బెంజమా 97మ్యాచుల్లో 37గోల్స్‌ కొట్టాడు. 2015లో సెక్స్‌-టేప్‌ కేసులో బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడినట్లు ఋజువు కావడంతో ఆ దేశ ఫుట్‌బాల్‌ సమాఖ్య బెంజెమాపై ఐదేళ్ల నిషేధం విధించింది. 2021లో తిరిగి పునారాగమనం చేసిన బెంజమా యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ ప్రి క్వార్టర్స్‌లో ఏకంగా నాలుగు గోల్స్‌ కొట్టి ఒక్కసారిగా పాపులర్‌ అయిపోయాడు. అయితే గాయం కారణంగా ఫిఫా ప్రపంచకప్‌ ఫ్రాన్స్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అతడి ఎడమకాలి తొడ కండరం చీలడంతో మెగా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఇక ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కరీమ్‌ బెంజెమా ప్రతిష్టాత్మక బాలన్‌ డీ ఓర్‌ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

1.కప్పు గెలిచిన అర్జెంటీనా.. అభిమానంతో 1500 మందికి ఫ్రీ చికెన్ బిర్యానీ

2.జెట్లు, డ్రోన్లతో హడావుడి చేస్తున్న చైనా

3.తొలిరోజున ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఈడీ అడిగిన ప్రశ్నలివే..