కరీంనగర్ బీజేపీ నేత రాసక్రీడ.. మహిళ బ్లాక్‌మెయిల్ - MicTv.in - Telugu News
mictv telugu

కరీంనగర్ బీజేపీ నేత రాసక్రీడ.. మహిళ బ్లాక్‌మెయిల్

October 2, 2020

Karimnagar BJP leader illigal relationship.. Woman blackmail

కరీంనగర్‌లో బీజేపీ నేత  బాస సత్యనారాయణ రాసక్రీడలు సంచలనం రేపాయి. జిల్లా పార్టీ కీలక నేతగా ఉన్న ఆయన ఓ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో అతని బండారం బయటపడింది. కరీంనగర్‌కు చెందిన బీజేపీ జిల్లా నాయకుడు  బాస సత్యనారాయణ మహిళా కార్యకర్తతో కామ కోరికలను తీర్చుకున్నాడు. మోజు తీరే వరకు ఆమెతో ఎంతో సాన్నిహిత్యంగా ఉన్నాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. దీంతో ఆ మహిళా కార్యకర్త సదరు నాయకుడి బండారాన్ని బయటపెడతాను అంది. డబ్బులు కావాలని బ్టాక్ మెయిల్‌కు పాల్పడింది. ఈ క్రమంలో సదరు నేత ఆమెతో బేరాలకు దిగాడు. అయితే ఆ బేరాలు బెడిసి కొట్టడంతో ఆయనగారి బండారం మొత్తం బయటపడింది. మహిళా కార్యకర్తతో సదరు నాయకుడు చేసిన కామక్రీడలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

ఇందుకు సంబంధించిన వీడియో, ఆడియోలు సోషల్ మీడియాలోవైరల్‌గా మారాయి. అయితే  బాస సత్యనారాయణ వ్యవహారం బీజేపీకి తలనొప్పిగా మారింది. పార్టీని పలువురికి  ఆదర్శంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన నాయకుడే ఇలా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా, ఈ వ్యవహారంపై రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బాస సత్యనారాయణను పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో గంగాడి కృష్ణారెడ్డిని నియమించారు.