యశోద ఆస్పత్రిలో కరోనా రోగి ఆత్మహత్య.. డెడ్‌బాడీ పరీక్షల్లో నెగిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

యశోద ఆస్పత్రిలో కరోనా రోగి ఆత్మహత్య.. డెడ్‌బాడీ పరీక్షల్లో నెగిటివ్

August 11, 2020

Karimnagar Corona Patient Malakpet Yashoda

తెలంగాణలో కరోనా రోగుల నుంచి ప్రైవేటు ఆస్పత్రుల దోపిడిపై విమర్శలు వ్యక్తం అవుతున్న సమయంలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మలక్‌పేట యశోద ఆస్పత్రిలో కరోనా రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన గదిలోని బాత్రూంలో రోగులు వేసుకునే గౌను సాయంతో ఉరి వేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రోగి బంధువులు ఆస్పత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల కారణంగా చనిపోయాడని ఆందోళనకు దిగారు. అయితే వైద్యులు మాత్రం కరోనా భయంతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. 

కరీంనగర్‌కు చెందిన రవీంద్ర రాజు ఈ నెల 6వ తేదీని కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. వెంటనే అతనికి పాజిటివ్ వచ్చిందని 503వ నంబరు గదిలో చికిత్స అందిస్తున్నారు.  సోమవారం రాత్రి 2.30 గంటల సమయంలో ఊహించని విధంగా ఉరివేసుకున్నాడు. ఉదయాన్నే సిబ్బంది దీన్ని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. అయితే అక్కడ డెడ్ బాడీకి కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ అని వచ్చింది.  దీంతో అతని బంధువులు ఆందోళనకు దిగారు. డబ్బుల కోసం లేని రోగాన్ని అంటగట్టారని ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.