చెల్లిని ప్రేమించాడని యువకుడి దారుణ హత్య! - MicTv.in - Telugu News
mictv telugu

చెల్లిని ప్రేమించాడని యువకుడి దారుణ హత్య!

October 20, 2020

sister

కరీంనగర్‌లో దారుణం జరిగింది. తన చెల్లిని ప్రేమించాడనే కోపంలో యువకున్ని హత్యచేశాడు ఓ అన్న. ఈ సంఘటన వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో జరిగింది. ప్రణయ్ అనే దళిత యువకుడు అదే గ్రామానికి చెందిన దళిత యువతి గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసింది. వీరు ప్రేమించుకోవడం వారికి ఇష్టం లేదు.

దీంతో అమ్మాయి అన్న ప్రణయ్‌ని హత్య చేయించాడని తెలుస్తోంది. ప్రణయ్ అర్థరాత్రి మిత్రులతో ఉన్న సమయంలో కొందరు దుండగులు వచ్చి ప్రణయ్‌పై దాడి చేశారు. కొట్టుకుంటూ తీసుకెళ్లి అంబేద్కర్ భవన్ వద్ద నరికి చంపారు. ఆ తరువాత మృతదేహాన్ని సమీపంలోని ముళ్ల పొదల్లో పడేశారు. పొద్దున్నే మృతదేహాన్ని చూసిన కాలనీ వాసులు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులుకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలికి చేరుకున్న కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి విచారణ మొదలెట్టారు.‌ ప్రేమ వ్యవహారంతోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.