కరీంనగర్‌లో కలకలం..గుండెపోటుతో చనిపోయినా పట్టించుకోలేదు - MicTv.in - Telugu News
mictv telugu

కరీంనగర్‌లో కలకలం..గుండెపోటుతో చనిపోయినా పట్టించుకోలేదు

March 25, 2020

Karimnagar

కరీంనగర్ వాసులను కరోనా కలవరపెడుతోంది. మనిషిని మనిషి ముట్టుకోవడానికే భయపడిపోతున్నారు. ఇటీవల ఇండోనేషియన్లు నగరంలో పలు ప్రాంతాల్లో తిరిగారు. వారికి కరోనా ఉన్నట్టు తేలడంతో ఎప్పుడు ఎవరి నుంచి వైరస్ వ్యాపిస్తుందోనని వణికిపోతున్నారు. తాజాగా కాశ్మీర్ గడ్డలోని కూరగాయల మార్కెట్లో దయనీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి  రైతు బజార్లో గుండెపోటుతో మరణించినా కనీసం ఆయన్ను ముట్టుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. 

కూరగాయలు కొనేందుకు మధ్య వయసు ఉన్న వ్యక్తి వచ్చాడు. ఉన్నట్టుండి అతడు కుప్పకూలిపోయాడు. అతన్ని చూసిన స్థానికులు కరోనాతో మరణించాడేమో అనుకొని భయపడిపోయారు. కనీసం అతన్ని ముట్టుకునేందుకు కూడా ముందుకు రాలేదు. దయనీయ స్థితిలో అతని మృతదేహం అక్కడే ఉండిపోయింది. ఈ విషయం తెలిసిన పోలీసులు వచ్చి అతని వివరాలను సేకరించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ ఘటనతో కరోనా నగర ప్రజల్లో ఎంతగా భయాన్ని నింపిదో తెలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.