కన్నీటికి అండ.. కరీంనగర్‌లో రూపాయికే అంత్యక్రియలు - MicTv.in - Telugu News
mictv telugu

కన్నీటికి అండ.. కరీంనగర్‌లో రూపాయికే అంత్యక్రియలు

May 20, 2019

అసలే ఆప్తులను కోల్పోయిన దు:ఖం. దానికి తోడు పేదరికం. లోకం వీడిపోయిన మనిషిని గౌరవంగా సాగనంపలేని దుస్థితి. మొక్కుబడిగా తుదివీడ్కోలు చెప్పాల్సిన దైన్యం. నిరుపేదలు ఎదుర్కొంటున్న ఈ సమస్య పరిష్కారం కోసం కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ పెద్ద మనసుతో ముందుకొచ్చింది.

Karimnagar municipal corporation providing Cremation facility for just only one rupee mayor ravinder singh announce.

మృతులకు కేవలం ఒక రూపాయి చెల్లిస్తే చాలు, పూర్తిస్థాయిలో అంత్యక్రియలు నిర్వహిస్తామని మేయర్ మేయర్ రవీందర్‌సింగ్ వెల్లడించారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. నగరంలోని పేదలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు రూపాయి చెల్లిస్తే నగరపాలక సంస్థ తరుపున తాము అంత్యక్రియలు పూర్తి చేస్తామన్నారు. ‘దీనికోసం రూ.1.50 కోట్లు కేటాయించాం. భౌతికదేహాల తరలింపు కోసం రెండు వ్యాన్లు, ఫ్రీజర్, ఇతర సామగ్రి కొంటున్నాం. ఎవరైనా చనిపోతే మాకు సమాచారం అందగానే వాహనం ఇంటికి చేరుకుంటుంది. అన్ని ఏర్పాట్లూ మేమే చేస్తాం. జూన్ 15 నుంచి దీన్ని అమలు చేస్తాం..’ అని చెప్పారు. మునిసిపాలిటీ నిర్వర్తించాల్సిన బాధ్యతల్లో ఇది కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు. నగరంలోని శ్మశాన వాటికల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.