కరీం తెల్గీ కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

కరీం తెల్గీ కన్నుమూత

October 26, 2017

వేల కోట్లకు సంబంధించిన నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న  కరీం తెల్గీ(56)  కన్నుమూశాడు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తెల్గీని గతకొంతకాలంగా  బెంగుళూర్‌లోని ఓ దవాఖానాలో చేర్పించి జైలు అధికారులు చికిత్స అందిస్తున్నారు.

నకిలీ స్టాంపుల కుంభకోణంలో దోషిగా తేలటంతో తెల్గీకి  30 సంవత్సరాల కఠిన శిక్ష విధించింది కోర్టు. అప్పటి నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆయన్ను ఉంచారు. దొంగ నోట్లు, నకిలీ పాస్‌పోర్టులను కూడా తయారు చేసి సొమ్ము చేసుకున్నట్లు తెల్గీపై ఆరోపణలు ఉన్నాయి.