ఫారిన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడిన కర్ణాటక ఆటోడ్రైవర్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఫారిన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడిన కర్ణాటక ఆటోడ్రైవర్..

November 25, 2022

వారి ప్రేమ ఖండాలను దాటింది. ఓ కర్నాటక యువకుడు.. ఫారిన్ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. సుమారు నాలుగు సంవత్సరాలు ప్రేమించుకుని వివాహమాడారు. ఇలాంటి పెళ్లిళ్లు ఈ మధ్య ఎక్కువ జరుగుతున్న వీళ్లది మాత్రం కొంచెం ఢిపరెంట్ స్టోరీ. విద్యావంతులు, విదేశాల్లో ఉద్యోగం చేసిన వారు ఇలా విదేశి యువతులను, యువకులను పెళ్ళి చేసుకోవడం చూసి ఉంటారు. కానీ ఇక్కడ ఓ ఆటోవాలా..బెల్జియం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

కర్ణాటకలోని విజయనగర్‌కు చెందిన అనంత్ రాజు ఆటో నడుపుతూ.. ప్రముఖ హంపి దేవాలయంలో టూరిస్ట్‌గా గైడ్‌గా పనిచేస్తున్నాడు. వచ్చిన పర్యాటకులకు హంపి యొక్క గొప్పతనాన్ని చక్కగా వివరించి.. వాళ్లకి కావల్సిన సౌకర్యాలను చూసుకుంటాడు. ఈ క్రమంలో బెల్జియం నుంచి జీప్ ఫిలిప్ ఫ్యామిలీకి టూరిస్ట్ గైడ్‌గా అనంత్ రాజు వెళ్లాడు. వారి విహారయాత్రలో ఎంతగానో సాయం చేశాడు. అతని మంచితనం నచ్చిన జీప్ ఫిలిప్ కుమార్తె కెమిల్.. రాజుతో స్నేహం చేసింది. స్నేహం కాస్త ప్రేమగా మారి ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. తర్వాత ఇంట్లో కూడా చెప్పి వివాహానికి ఒప్పించుకున్నారు. ఈ సమయంలో కరోనా రావడంతో వివాహం కాస్త ఆలస్యమైంది. అయితే బెల్జియంలో ఘనంగా వివాహం చేయాలని ముందు అనుకున్నారు. కానీ అనంత్ రాజు కోరిక మేరకు హిందూ సంప్రదాయం ప్రకారం ఇండియాలోనే వివాహం జరిపించారు. శుక్రవారం ఉదయం 9.25 గంటలకు హంపిలోని విరూపాక్షేశ్వరుని సన్నిధిలో వధు, వరుల బంధుమిత్రుల మధ్య ఘనంగా పెళ్లి జరిగింది. దీంతో నాలుగు సంవత్సరాల ప్రేమకు శుభం కార్డ్ పడింది.