karnataka bjp master sketch behind ntr invitation to puneeth rajkumar award function
mictv telugu

బీజేపీ భారీ వ్యూహంలో.. ఎన్టీఆర్ తల్లి షాలిని

November 2, 2022

karnataka bjp master sketch behind ntr invitation to puneeth rajkumar award function

కర్నటకలో దివంగత పునీత్ రాజ్ కుమార్ పేరిట నిర్వహించిన ‘కర్ణాటక రత్న’ ప్రోగ్రామ్ ని బీజేపీ తన రాజకీయ అవసరాలకు వాడుకుందా అంటే అవుననే సమాదానాలు వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తమిళనాడు నుండి రజినీకాంత్ రాగా.. తెలుగు రాష్ట్రాల నుండి జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు. అయితే ఈ ఇద్దరినీ మాత్రమే కార్యక్రమానికి పిలవటం వెనుక రాజకీయం ఉందంటున్నారు విశ్లేషకులు. పునీత్ ఫ్యామిలీతో సత్సంబంధాలు ఉన్న కారణంగానే ఎన్టీఆర్ ని పిలిచామని కర్నటక బీజేపీ ప్రభుత్వ పెద్దలు చెప్తున్నా..నిజం కాదంటూ విశ్లేషణలు వస్తున్నాయి. టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలున్నా ఎన్టీఆరే ఎందుకు అని ప్రశ్నలొస్తున్నాయి. అయితే ఎన్టీఆర్, పునీత్ బెస్ట్ ఫ్రెండ్స్. ‘చక్రవ్యూహ’ సినిమాలో పునీత్ కోసం ఎన్టీఆర్ పాట పాడారు కూడా! ఇద్దరి మధ్య ఉన్నా ఆ ఫ్రెండ్షిప్ చూసే కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా ఎన్టీఆర్ ని పిలిచిందనేది అందరి మధ్య ఉన్నా అభిప్రాయమైనా.. ఎన్టీఆర్ ని మచ్చిక చేసుకోవడానికే బీజేపీ పావులు కదుపుతోందని అంటున్నారు.

త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఎన్టీఆర్ పై బీజేపీ బిగ్ స్కెచ్ రెడీ చేసినట్టు సమాచారం. ఇప్పటికే కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సైతం ఎన్టీఆర్ ని హైదరాబాద్ లో కలిసి బీజేపీకి సహకరించాల్సిందిగా కోరాడు. అప్పుడు కుదిరిన ఒప్పందంలో భాగంగానే కర్నటకలో ఎన్టీఆర్ తో ప్రచారం చేయించుకోవాలని బీజేపీ పావులు కదుపుతుంది. అయితే ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఎన్టీఆర్ తల్లి షాలిని కర్ణాటక వాసి. ఆమె చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన వారు. అందుకే ఎన్టీఆర్ స్పషంగా, అర్థవంతంగా కన్నడ మాట్లాడగలరు. షాలిని కుటుంబీకులు సైతం చిత్రదుర్గ లోకల్ రాజకీయాల్లో ఉన్నారని.. వారి సహాయాన్నిసైతం బీజేపీ వాడుకోనుందని అంటున్నారు. ఇక కర్ణాటకలో ఎన్టీఆర్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా రాయచూరు, గంగావతి, సింధునూరు, బళ్లారి లాంటి ఏరియాల్లో చాలా వరకూ తెలుగు సెటిలర్లే. వారిని ప్రభావితం చేయటం కోసం ఎన్టీఆర్ క్రేజ్, మదర్ సెంటిమెంట్ ని వాడేయాలనదే బీజేపీ కొత్త స్కెచ్ అంటూ రూమర్స్ వస్తున్నాయి.