BJP MLA : రూ.40లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు..!! - Telugu News - Mic tv
mictv telugu

BJP MLA : రూ.40లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు..!!

March 3, 2023

కర్నాటక బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కుమారుడు రూ. 40లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. బెంగుళూరులోని తన కార్యాలయంలో లంచం తీసుకుంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మదల్ ను లోకాయుక్త అధికారులు పట్టుకున్నారు. కర్నాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ చైర్మన్ గా మదల్ విరూపాక్షప్ప వ్యవహరిస్తున్నారు. కాగా ప్రశాంత్ లంచం తీసుకుంటున్నాడు ఓ వ్యక్తి గురువారం ఫిర్యాదు చేసినట్లు లోకాయుక్త అధికారులు వెల్లడించరు.

 

ఇంకొంత డబ్బు డిమాండ్ చేశాడని లోకాయుక్త అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో లోకాయుక్త అధికారులు పక్కా ప్లాన్ తో ప్రశాంత్ రూ. 40లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆయన కార్యాలయంలో సోదాలు నిర్వహించి రూ. 1.7కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు లోకాయుక్త అధికారులు తెలిపారు. తండ్రి తరపున ప్రశాంత్ ఈ లంచం తీసుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. కార్యాలయంలో దొరికన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై ఆరా తీస్తున్నట్లు లోకాయుక్త అధికారులు వెల్లడించారు.