Karnataka Budget 2023: CM announces interest-free 5 Lakh loan to farmers
mictv telugu

Karnataka Budget 2023 : రైతులకు సున్నావడ్డీతో రూ. 5 లక్షల అప్పు.. సీఎం

February 17, 2023

 

Karnataka Budget 2023: CM announces interest-free 5 Lakh loan to farmers

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని రైతులకు సున్నా వడ్డీతో రూ. 5 లక్షల వరకు రుణం ఇస్తామని చెప్పారు. శుక్రవారం ఆయన ఆర్థిక మంత్రి హోదాలో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైతుల సంక్షేమం కోసం వడ్డీ లేని రుణ మొత్తాన్ని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నామని చెప్పారు. రైతు బాగుంటే అందరం బాగుంటామని పేర్కొన్నారు. రైతులు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి, వారిపై ఆర్థిక భారం పడకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
చేనేత పింఛన్ పెంపు..
బడ్జెట్లో సీఎం చేనేత కార్మికులపైనా వరాల వర్షం కురిపించారు. వారికి ఇస్తున్న సబ్సిడీని రూ. 3 వేల నుంచి 5 వేలకు పెంచారు. యాసిడ్ దాడి బాధులకు రూ. 10వేలతో పాటు నెలనెలా రూ . 500 పింఛను కూడా ఇస్తామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్మీలో ప్రవేశపెట్టిన్ అగ్నివీర్ ఉద్యోగాల కోసం ఎస్సీ, ఎస్టీ, ఇతర మైనారిటీల యువతకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. కొత్త రోడ్డు మార్గాల ప్రాజెక్టుల కోసం భారీ నిధులు కేటాయించారు. అయితే ఈ పథకాలు, వరాలు అన్నీ ఎన్నికల కోసం ప్రకటించిన తాయిలం అని, రైతులపట్ల నిజంగా ప్రేమ ఉంటే ఎందుకు ముందుకే అమలు చేయలని విపక్ష కాంగ్రెస్, జేడీఎస్ ప్రశ్నించాయి. రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. మళ్లీ అధికారం దక్కించుకోవడానికి బీజేపీ అన్ని శక్తులు ఒడ్డి పోరాడుతోంది.