ఏపీ బాటలో కర్ణాటక.. బెంగళూరు నుంచి కార్యాలయాల తరలింపు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ బాటలో కర్ణాటక.. బెంగళూరు నుంచి కార్యాలయాల తరలింపు..

February 21, 2020

Karnataka capital offices shifting

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ పేరుతో జగన్ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటుకు సంకల్పించడం, దీనిపై తీవ్ర విమర్శలు వస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని బెంగళూరులోని కొన్ని ప్రధాన శాఖల కార్యాలయాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలించాలని యడ్యూరప్ప కేబినెట్ నిర్ణయించింది. 

బీజేపీ అధిష్టానం దీనికి ఆమోదం తెలిపింది. ఉత్తర కర్ణాటక ప్రజలను అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఈశ్వరప్ప చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలను బెంగళూరుతోపాటు బెళగావిలోనూ నిర్వహిస్తుంటారు. అదేబాటలో కొన్ని కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించి పరిపాలనను వికేంద్రీకరించాలని సర్కారు సంకల్పించింది.