ఆ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న ముఖ్యమంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

ఆ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న ముఖ్యమంత్రి

June 14, 2022

777 చార్లీ అనే సినిమా చూసి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ వ్యక్తికి పెంపుడు కుక్కతో అనుబంధాన్ని ప్రధానంగా చూపించిన ఈ సినిమా చూసి బొమ్మైకి చనిపోయిన తన పెంపుడు కుక్క గుర్తుకు వచ్చిందట. ఆ కుక్కను గుర్తు చేసుకొని సినిమా హాలులోనే కన్నీళ్లు పెట్టుకున్నారట. ఇందుకు సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘కుక్కల గురించి చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ఈ సినిమాలో జంతువులతో ఉండే అనుబంధం, భావోద్వేగాన్ని చాలా గొప్పగా చూపించారు. సినిమా బాగుంది. అందరూ చూడాల్సిందే అన్నారు. కుక్కల ప్రేమ అనేది షరతులు లేని ప్రేమ. ఇది స్వచ్ఛమైన ప్రేమ` అని సినిమా చూసిన అనంతరం సీఎం బొమ్మై అన్నారు. గతేడాది తన పెంపుడు కుక్క చనిపోయిందని ఆయన బాధపడ్డారు.