కమలం పార్టీకి కరోనా సెగ.. మరో సీఎంకు పాజిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

కమలం పార్టీకి కరోనా సెగ.. మరో సీఎంకు పాజిటివ్

August 3, 2020

Karnataka CM Test Corona Positive

భారతీయ జనతా పార్టీ కీలక నేతలకు కరోనా సెగ తగులుతోంది. ఆ పార్టీలో కీలక నేతలు వరుసగా వ్యాధికి గురౌతున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వైరస్ బారిన పడగా.. తాజాగా కర్నాటక సీఎం యడియూరప్పకు కూడా కరోనా సోకింది. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో చికిత్స కోసం మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు.

యడియూరప్పలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకున్నా వ్యాధి నిర్ధారణ అయింది. పరిపాలన సమీక్షలో భాగంగా ఆయన తరుచూ అధికారులు, ప్రజా ప్రతినిధులను కలుస్తున్నారు. ముందు జాగ్రత్తగా టెస్టులు చేయించుకోగా ఈ విషయం వెల్లడైంది.వెంటనే ఆయనకు వైద్యం అందించడం ప్రారంభించారు. సీఎం కార్యాలయంతో పాటు ఆయన నివాస ప్రాంతాల్లో శానిటైజేషన్ చేశారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ కరోనా వైద్య పరీక్షలను చేయించుకోవాలని సూచించారు. డాక్టర్ల సూచనల ప్రకారం తాను ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్నానని తెలిపారు. 77 సంవత్సరాల వయసున్న ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ, ఇతర ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. కాగా. ఆదివారం ఒక్కరోజే చాలా మంది ప్రముఖులకు పాజిటివ్ అని తేలింది. పొరుగునే ఉన్న తమిళనాడు గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ కూడా కరోనా లక్షణాలతో ఐసోలేషన్‌లో ఉన్నారు.