పెళ్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కత్తితో దాడి  - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కత్తితో దాడి 

November 18, 2019

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సేథ్‌పై కత్తితో దాడి జరిగింది. ఆదివారం రాత్రి మైసూరులో ఓ పెళ్లికి హాజరైన ఆయనపై ఫర్హాన్ పాషా అనే యువకుడు పదునైన కత్తితో దాడి చేశారు. అనుచరుల మధ్య ఉండగానే ఈ ఘటన జరిగింది. వెంటనే అక్కడ ఉన్నవారు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దాడి తర్వాత తీవ్ర రక్తస్త్రావం కావడంతో ఎమ్మెల్యేను వెంటనే కొలంబియా ఆసియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. 

దాడికి పాల్పడిన నిందితుడు ఉదయగిరికి చెందిన హస్తకళాకారుడిగా గుర్తించారు. ఉద్యోగం కోసం ఎమ్మెల్యేలను అతను రెండు మూడు సార్లు కలుసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఉద్యోగం ఇప్పించకపోవడంతోనే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఘటనపై ఫర్హాన్ పాషాను పోలీసులు విచారిస్తున్నారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని మైసూరు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఎమ్మెల్యేపై దాడి జరగడంతో ఆయన అనుచరులు హాస్పిటల్‌కు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.