Home > Featured > ‘హిందూ’ అనే పదానికి అర్ధం తెలిస్తే సిగ్గుపడతారు’.. వీడియో వైరల్

‘హిందూ’ అనే పదానికి అర్ధం తెలిస్తే సిగ్గుపడతారు’.. వీడియో వైరల్

Karnataka Congress Working President Satish Laxman made controversial comments on Hindu word

హిందూ అనే పదంపై కర్ణాటక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ లక్ష్మణ రావు జార్కిహోళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బెలగావిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ పదం పర్షియా నుంచి వచ్చిందని, దానికి భారత్‌లో ఎలాంటి మూలాలు లేవని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘హిందూ అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది.

అది మనదేనా? ఇది ఇరాన్, ఇరాక్, ఉజ్బెకిస్థాన్, కజకిస్తాన్ ప్రాంతం నుంచి వచ్చిన పర్షియన్ పదం. హిందూ అనే పదానికి భారతదేశానికి ఉన్న సంబంధం ఏమిటి? అప్పుడు దానిని మీరు ఎలా అంగీకరించగలరు? దీనిపై చర్చ జరగాలి. హిందువు అనే పదానికి అర్ధం తెలిస్తే మీరు సిగ్గుపడతారు. అసభ్యకరమైనది అని దాని అర్ధం’ అని ఆయన చేసిన ప్రసంగంపై దుమారం రేగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, అధికార బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సతీష్ వ్యాఖ్యలు అవమానకరంతో పాటు రెచ్చగొట్టేలా ఉన్నాయని బీజేపీ మండిపడింది. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత అయి సతీష్ లక్ష్మణరావు గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా పని చేశారు.

Updated : 7 Nov 2022 6:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top