ఓటర్ ఐడీ కాదు... పెళ్లి పత్రిక - MicTv.in - Telugu News
mictv telugu

ఓటర్ ఐడీ కాదు… పెళ్లి పత్రిక

April 17, 2019

దేశమంతా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నడుస్తోంది. రాజకీయ నేతలతో పాటు ప్రజలు కూడా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కొందరు పెళ్లి పత్రికలపై వారికి నచ్చిన రాజకీయ పార్టీలకు మద్దతు ప్రకటిస్తున్నారు. కొందరేమో ఓటు ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడానికి శుభలేఖలపై సందేశాలను అచ్చు వేస్తున్నారు. ప్రస్తుతం ఓటర్ ఐడీ కార్డు మాదిరిగా తయారైన ఓ శుభలేఖ వైరల్ అవుతోంది.

ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తేవాలన్న ఆలోచనతోనే ఇలా ఎన్నికల గుర్తింపు కార్డులా శుభలేఖను ప్రచురించామని వధూవరులు చెబుతున్నారు. కర్ణాటకలోని ధార్వాడకు చెందిన సునీల్‌‌కు, అన్నపూర్ణలకు ఈనెల 26న వివాహం నిశ్చయించారు. ప్రస్తుతం లోక్‌‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఓటు ఆవశక్యతను తమ పెళ్లికి వచ్చే బంధు మిత్రులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో, వీరు తమ శుభలేఖను వినూత్నంగా తీర్చిదిద్దారు.