రోడ్లు బాగుండటం వల్లే ప్రమాదాలు : కర్నాటక డిప్యూటీ సీఎం - MicTv.in - Telugu News
mictv telugu

రోడ్లు బాగుండటం వల్లే ప్రమాదాలు : కర్నాటక డిప్యూటీ సీఎం

September 13, 2019

Karnataka Deputy CM Govind Karjol Comments on Roads

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మోటార్ సవరణ బిల్లుపై చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. భారీ జరిమానాలు తాము విధించబోమంటూ తేల్చి చెబుతున్నారు. ఈ వరుసలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. రోడ్లు సరిగా లేనప్పుడు చలానా ఎలా వసూలు చేస్తారంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.  కొత్త చట్టంపై పలువురు అభ్యంతరం చెబుతుండటంతో కర్నాటక డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రోడ్డు భద్రత పాటించాలనే కేంద్రం కొత్త చట్టం తెచ్చిందని అన్నారు. ‘అంతా రోడ్లు సరిగాలేక ప్రమాదాలు జరుగుతున్నాయని చాలా మంది అంటున్నారు. కానీ అందులో వాస్తవం లేదు. రోడ్లు బాగుండటం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. హైవేల పైనే యాక్సిడెంట్లు ఎక్కువగా నమోదు అవుతున్నాయి’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని సూచించారు. అయితే ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి మాత్రం భారీ జరిమాన విధించడం సరికాదని  గోవింద్ అభిప్రాయపడ్డారు.