శశకళపై డేరింగ్ ఆఫీసర్ రూప..మరో బాంబు..! - MicTv.in - Telugu News
mictv telugu

శశకళపై డేరింగ్ ఆఫీసర్ రూప..మరో బాంబు..!

July 18, 2017

బదిలీ వేటుకు కర్నాటక జైళ్ల శాఖ డీజీ రూప భయపడలేదు..అదరలేదు…బెదరలేదు. శశికళపై మరో బాంబు పేల్చారు. శశికళకు జైల్లో రాజభోగాలు అందిస్తున్నారంటూ సంచలనం సృష్టించిన రూప…ప్రత్యేక పాత్రల్లో స్పెషల్ వంటకాల్ని వండి వడ్డీంచాలరని, ప్రత్యేక పడకను ఏర్పాటు చేశారని రెండో నివేదిక రూపొందించారు. నేడో రేపో దాన్ని ప్రభుత్వానికి అందించబోతున్నారు.

అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహారం జైల్లో ఉన్న శశికళకు రాజభోగాలు అందుతున్నాయని సంచలనం సృష్టించిన డీజీ రూప బదిలీ వేటు పడినా ఏమాత్రం తగ్గడం లేదు. జైళ్లశాఖ నుంచి ట్రాఫిక్‌కు రూపను బదిలీ చేస్తూ కర్నాటక పోలీస్ శాఖ సోమవారం ఉత్తర్వులిచ్చింది. ఇదే రోజు ఆమె తన రెండో నివేదికను బయటపెట్టడం హైలైట్. పరప్పన అగ్రహారం జైల్లో శశికళకు సకల సౌకర్యాలు అందిస్తున్నట్లు తన పరిశీలనలో వెల్లడైందని రెండో నివేదికలో రూప పొందుపరిచారు. శశి కోసం జైల్లో ఐదు బ్యారక్‌లు ఖాళీగా ఉంచారని తెలిపారు. ఆ అయిదు బ్యారక్‌లకు తాళం వేయకుండా ఉంచారని, అటు వైపు ఎవరినీ రాకుండా జైలు సిబ్బంది అడ్డుకున్నారని రెండో నివేదికలో తెలిపారు. జైల్లో శశి కోసం ప్రత్యేక పాత్రల్లో వంటలు వండి తీసుకువచ్చారని, అంతేకాకుండా ప్రత్యేక పడక కూడా ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ రెండో నివేదికను ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు రూప తెలిపారు.
అసలే తొలి నివేదికతోనే సతమతవుతున్న సిద్ధరామయ్య సర్కార్…జైళ్లలో శశికళకు ఏలాంటి రాచమర్యాదలు జరుగలేదని చెప్పుకొచ్చింది. ఇంతలో పోలీస్ ఆఫీసర్ రూప రెండో నివేదికను రూపోందించడం కర్నాకటలో కలకలం రేపుతోంది. శశికళకు జైల్లో రాజభోగాలు అందిస్తున్నారంటూ రూప రూపొందించిన నివేదిక ప్రభుత్వానికి చేరకముందే లీక్ అయింది. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు రూపపై పొగడ్త వర్షం కురిపిస్తున్నారు. గుడ్ జాబ్ ఎవరికి భయపడొద్దు మీకు మేమున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.

తొలి రిపోర్ట్ తో రూపపై బదిలీవేటు వేసిన కర్నాటక సర్కార్…ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. ఇప్పటికే కేరీర్ లో 25 బదిలీలు చూసిన రూప…ఇంకేముంది చేస్తే మరో బదిలీయే అనుకున్నట్టు ఉన్నారు…క్యారీ ఆన్ రూప మేడమ్…దేనికీ భయపడొద్దు…మీ వెనుక జనం ఉన్నారు.