బస్సులో వంద కోట్లు.. ఎన్నికల కోసం! - MicTv.in - Telugu News
mictv telugu

బస్సులో వంద కోట్లు.. ఎన్నికల కోసం!

April 17, 2018

కర్ణాటక ఎన్నికల్లో మద్యం సంగతేమోగాని డబ్బుమాత్రం ఏరులు, సముద్రాలై పారుతోంది.  చిక్కబళ్లాపూర్‌ జిల్లా తిప్పగానిపల్లి వద్ద ఓ ప్రైవేటు బస్సులో రూ. 100 కోట్ల కరెన్సీ బయటపడింది. అనంతపురం-బళ్లారి జాతీయరహదారిపై తిప్పగానిపల్లి వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఈ డబ్బు వెలుగు చూసింది. ఎన్నికల కోసమే ఈ మొత్తాన్ని తరలిస్తున్నట్టు భావిస్తున్నారు.నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలూ లేవని, డ్రైవర్, ఇతర సిబ్బంది పొంతనలేని సమాధానాలు ఇచ్చారని పోలీసులు తెలిపారు.  కర్ణాటకలో ఒక బస్సులో ఇంత డబ్బు దొరకడం ఇదే తొలిసారి అని అన్నారు. దాదాపు అన్నీ రెండువేల నోట్లే ఉన్నాయని, లెక్కించగా రూ. 100కోట్లకు పైనే ఉందని వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తన్ని ఏపీ నుంచే తీసుకొస్తూ ఉండొచ్చని, అయితే పూర్తి వివరాల కోసం ఇంకా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలకు పంచేందుకే ఈ నగదులు తీసుకెళ్తూ ఉండొచ్చని భావిస్తున్నారు. కర్ణాటకలో గెలుపు కోసం ఒక జాతీయ పార్టీ పక్కాగా ప్లాన్ చేసి, భారీగా డబ్బు తరలిస్తోందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వంద కోట్లు బయటపడడం గమనార్హం.