Karnataka government announces 2 thousand rupees pension for divine narthakas
mictv telugu

కాంతార ఎఫెక్ట్.. పింఛను ప్రకటించిన కర్ణాటక

October 20, 2022

Karnataka government announces 2 thousand rupees pension for divine narthakas

చిన్న బడ్జెట్ మూవీగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార సినిమా సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కర్ణాటకలో ఇప్పటికే వంద కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం తర్వాత పాన్ ఇండియా రేంజులో రిలీజై అన్ని చోట్లా మంచి టాక్ తెచ్చుకుంటుంది. ఇందులో కథాకథనంతో పాటు రిషభ్ షెట్టి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సినిమాలో కళాకారులు ప్రాచీన నృత్య ప్రదర్శనను అద్భుతంగా చూపించారు. దేవుణ్ణి ఆరాధించే పురాతన పద్ధతిని కళ్లకు కట్టినట్టు చూపించడంతో చిత్ర బృందం సక్సెస్ అయ్యింది. ఈ సినిమా హిట్ అవడంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిజ జీవితంలో ఉన్న ఇలాంటి కళాకారులకు పింఛను సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. 60 ఏళ్లు దాటిన కళాకారులకు నెలకు 2 వేల రూపాయలు ఇస్తామని ఆ రాష్ట్ర ఎంపీ పీసీ మోహన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సనాతన ధర్మంలోని పురాతన పూజా పద్ధతిని యావత్ భారతానికి తెలియజేసిన ఈ సినిమా టీంకి అభినందనలు తెలిపారు. కాగా, ఓ సినిమా వల్ల ప్రభుత్వం స్పందించి ఇలాంటి సదుపాయం కల్పించడం ఇదే తొలిసారి. దీంతో అనేక రికార్డులు కొల్లగొడుతున్న కాంతార అరుదైన జాబితాలో తన పేరును మొదటి వరుసలో లిఖించినట్టయింది.