karnataka Governor approves anti-conversion bill
mictv telugu

మతమార్పిడి నిరోధక బిల్లుకు గవర్నర్ ఆమోదం

May 17, 2022

karnataka Governor approves anti-conversion bill

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చిన మత మార్పిడి నిరోధక బిల్లుపై గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మంగళవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ చట్టం అమల్లోకి వచ్చినట్టైంది. ఈ చట్టం ప్రకారం తప్పుడు వివరణ, బలవంతం, మోసం, అనుచిత ప్రలోభాలు, నిర్భంధం, పెళ్ళి వంటి వాటి ద్వారా వేరే మతంలోకి మారడం నిషేధం. ఉల్లంఘించిన వారికి మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 25 వేలు జరిమానా విధించవచ్చు. మైనర్, మహిళ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారిని చట్టవిరుద్ధంగా మతం మార్చిన వారిని మూడు నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 వేల వరకు జరిమానా విధిస్తారు. సామూహిక మత మార్పిడులకు పాల్పడ్డ వారికి మూడు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష జరిమానా విధిస్తారు.

ఈ చట్టం ప్రకారం మతం మారాలనుకునేవారు రెండు నెలల ముందుగా డిప్యూటీ కమిషనర్‌కు తెలియపరచాలి. లేదా మతం మారిన తర్వాత 30 రోజుల్లోగా తెలియజేయాలి. ఈ తరహా చట్టం చేసిన రాష్ట్రాల్లో కర్ణాటక తొమ్మిదవది. కాగా, ఈ బిల్లును ఆమోదించవద్దని సోమవారం బెంగళూరు ఆర్చ్ బిషప్ గవర్నర్‌ను కోరారు.