నేరాలు చేసి జైలు జీవితం అనుభవించే ఖైదీలకు జైలులో వివిధ పనులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. వారికి కేటాయించిన పనులను ఖైదీలు నిర్వర్తించి డబ్బులను సంపాదిస్తారు. చేసిన పని, కష్టపడిన గంటలు బట్టి వేతానాన్ని అందిస్తారు. వీటిపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖైదీలకు చెల్లించే వేతనాలను భారీగా పెంచింది. ఈమేరకు రాష్ట్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఖైదీల జీతాలను ఏకంగా మూడు రెట్లు పెంచింది. వివిధ నేరాలు చేసి జైలుకు వచ్చిన ఖైదీలు వాళ్లు చేసే పనులకు రోజుకు రూ.524 అందుకుంటారు. రెండో ఏడాది రోజుకు రూ.548 చొప్పున నెలకు రూ.14,248, మూడో ఏడాది రోజుకు రూ.615 చొప్పున నెలకు రూ.15,990, నాలుగో ఏడాది నుంచి రోజుకు రూ.663 చొప్పున నెలకు రూ.17,238 అందిస్తారు. వారంలో ఒకరోజు సెలవు ఉంటుంది. ఖైదీలు విడుదలైన సమయంలో ఈ వేతనాలను వారికి అందిస్తారు. ఖైదీల అనుమతితో వారి కుటుంబ సభ్యులకు కూడా పంపించే అవకాశం ఉంది.
ప్రస్తుతం కర్ణాటక వ్యాప్తంగా 54 జైళ్లలో 3,565 మంది ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరికి వేతనాల రూపంలో రూ.58,28,34,720 ప్రభుత్వం అందిస్తుంది. ఖైదీలకు జీతాలను పెంచడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఉచిత భోజనం, వసతితో పాటు భారీ వేతనాలతో ఖైదీల పనే బాగుందంటున్నారు.
ఇవి కూడా చదవండి :
కేటీఆర్ మామ కన్నుమూత.. కేసీఆర్ సంతాపం..