కరోనా టైంలోనూ కక్కుర్తి..మంత్రికి పేద్ద దండ - Telugu News - Mic tv
mictv telugu

కరోనా టైంలోనూ కక్కుర్తి..మంత్రికి పేద్ద దండ

June 2, 2020

nvb n

కరోనా వైరస్ ఎక్కువగా విజ్రింభిస్తోన్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. అయినా కూడా అక్కడి రాజకీయనాయకులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ రాములు చేసిన నిర్వాకమే ఇందుకు నిదర్శనం. కరోనా వైరస్ వ్యాప్తి సమయాల్లో బాధ్యతగా ఉండాల్సిన ఆరోగ్య మంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. చిత్రదుర్గలో ఈరోజు ఓ ఊరేగింపులో ఆయన పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎవ్వరూ భౌతిక దూరం పాటించలేదు, మాస్క్ ధరించలేదు. ఆరోగ్యశాఖా మంత్రి నిలబడి ఉన్న వాహనం చుట్టూ ఎలాంటి నిబంధనలు పాటించకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. బత్తాయిలు, ఆపిల్ పండ్లతో చేసిన గజమాలతో మంత్రిగారిని సత్కరించారు. మంత్రి కూడా అక్కడున్న వారిని హెచ్చరించే ప్రయత్నం చేయలేదు. జనం జేజేలు కొడుతుంటే నమస్కరిస్తూ అలాగే ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రిగారి  నిర్వాకం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.