https://www.facebook.com/DramaCompany9/videos/795278243987978/
సిన్మలల్ల హీరోలు ఒంటిశేత్తోని రథాలను లేప్తరు,బగ్గ బలిసిన దున్నపోతుకు ఎదురెళ్లి మరీ కొట్లాడ్తరు.పెద్ద పెద్ద బండరాళ్లనుగుడ నవ్వుకుంట ఒంటిశేత్తోని ఎత్తి అవుతల వాడేస్తరు,గోడను గుడ ఒక్క గుద్దుతోనే ఇట్కలుగుడ మిగ్లకుంట తుక్కు తుక్కు జేస్తరు,ఇగ కార్లను పెద్ద పెద్దజీబుల్ను ఒక్క గుద్దు గుద్దెనాంటే ఆ తయారుజేశిన కంపినోడు గుడ పర్శాన్ గావాల్సిందే మనం గింత తూట్ పాలీష్ బండ్లు తయారు జేస్తున్నమా అని,హెలికాప్టర్లకేలి దుంకుతరు, బిల్డింగ్ ల మీద కార్లు నడ్పుతరు,ఎంతైనా హీరోలు గదా గామాత్రం శెయ్యకపోతే ఎట్ల కదా…మరి ఇవన్ని గ్రాఫిక్స్ ల జేస్తరని తెల్సినా గుడ మనం సీటీల మీద సీటీలు కొడ్తం.ఎందుకంటే ఆళ్ళంటే మనకు అంత అభిమానం.
రియల్ హీరోస్…
గీడ జూడున్రి…కర్నాటకకు చెందిన కొందరు పైల్వాన్లు ఎసొంటి సాహసాలు జేస్తున్నరో,నోట్లున్న పండ్లతోని నాగలిని లేపిండంటే..ఆయన పండ్ల గట్టితనం గనక టూత్ బ్రష్ ,పేస్ట్ కంపినోళ్లకు తెల్శెనంటే ఆయ్నను గుంజుక పొయ్యి ఆళ్ల కంపిన్లకు బ్రాండ్ అంబాసిడర్ ను చేస్కుంటరేమో.ఇగ బండరాళ్లను పోరగాళ్లు తినే పాపుడాల లెక్కనే పలగ్గొడ్తుంటే సిన్మ హీరో సల్మాన్ ఖాన్ గుడ పర్శానై జూశిండు.బండి చక్రాలను ఓటిమిదోటి నాల్గైదు ఒక్కడే మోశిండంటే..ఒలంపిక్స్ లకు పంపిస్తే మొత్తం బంగారు పతాకాలే పోన్రి.గాయ్న గంత గట్టిగుండనీకి కారణమేందో ఏందింటడో గనీ…గ సీక్రెటేందో మన హీరోలకు శెప్తే మంచిగుండు గదా.. డూప్ లను వెట్కోకుంట గ్రాఫిక్స్ చెయ్యకుంట..ఇంకా దుమ్ములేపెటోళ్లు గావచ్చు.