ఏసీబీపై జడ్జీ.. పిల్లి మెడలో గంట కట్టేందుకు సిద్ధం - MicTv.in - Telugu News
mictv telugu

ఏసీబీపై జడ్జీ.. పిల్లి మెడలో గంట కట్టేందుకు సిద్ధం

July 6, 2022

అవినీతి నిరోధక శాఖపై కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ అవినీతి కూపంలా మారిపోయిందని నేను చేసిన వ్యాఖ్యలపై నాకు బెదిరింపులు వచ్చాయి. గతంలో ఇలా ఓ న్యాయమూర్తి బదిలీ అయ్యారు. అయినా సరే. నాకు భయం లేదు. నేను రైతు కొడుకుని. ఉద్యోగం పోయినా పర్వాలేదు. నేను 50 రూపాయలతో కూడా బతకగలను. ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదు. ఎవ్వరికీ లొంగను. రాజ్యాంగానికి మాత్రమే కట్టుబడి ఉంటా. అలాగే పిల్లి మెడలో గంట కట్టేందుకు కూడా నేను సిద్ధం’ అని పేర్కొన్నారు. 2021 మేలో రూ. 5 లక్షలు లంచం తీసుకొని అరెస్టయిన బెంగళూరు కలెక్టరేట్‌లోని డిప్యూటీ తహసీల్దార్ కేసు విచారణ సందర్భంగా జడ్జీ పై వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఎస్సై నియామకాల్లో జరిగిన అవినీతికి బాధ్యత వహిస్తూ హోం మంత్రి, ముఖ్యమంత్రిలు రాజీనామా చేయాలని కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. పాలనా యంత్రాంగానికి కొన్ని విషయాల్లో కళంకం వచ్చిందనీ, న్యాయమూర్తులకే భద్రత లేని పరిస్థితిని చూస్తున్నామని విమర్శించారు. స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రను విచారించాలని కోరారు.,