కర్ణాటకలో మతఘర్షణలు.. కత్తిపోట్లు, విధ్వంసం.. - MicTv.in - Telugu News
mictv telugu

కర్ణాటకలో మతఘర్షణలు.. కత్తిపోట్లు, విధ్వంసం..

July 7, 2022

కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా కెరూర్ పట్టణం మత ఘర్షణలతో అట్టుడిపోయింది. రెండు వర్గాలకు చెందిన జనం కత్తిపోట్లు, షాపుల ధ్వంసం, దహనకాడలతో రెచ్చిపోయారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు కర్ఫ్యూ విధించారు. రెండు వర్గాల ప్రజల మధ్య తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఒకవర్గం వారు మరొక వర్గానికి చెందిన దుకాణాలను, తోపుడు బండ్లను ధ్వంసం చేశారు. కొన్ని వాహనాలను తగలబెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు జనం గుమికూడకుండా ఆంక్షలు విధించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. మహిళలపై వేధింపులకు సంబంధించి ఇరు వర్గాలు గొడవపడ్డాయని, 18 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు.