Karnataka labor commission sent notice to amazon on removing employees layoff
mictv telugu

ఉద్యోగుల తొలగింపుపై అమెజాన్‌కు కార్మిక శాఖ నోటీసు

November 23, 2022

Karnataka labor commission sent notice to amazon on removing employees layoff

ప్రపంచ ప్రఖ్యాత ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఆదాయం తగ్గిందంటూ వేల మంది ఉద్యోగులను తీసేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ తొలగింపులో నియమ నిబంధనలకు పాతరేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కర్ణాటక కార్మిక విభాగ కమిషనర్ నోటీసులు జారీ చేశారు.

అమెజాన్ పబ్లిక్ పాలసీ మేనేజర్ స్మితా శర్మ నవంబర్ 23న తమ ముందు హాజరు కావాలని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ అంజనప్ప ఆదేశించారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా ఉద్యోగులను తొలగిస్తున్నారని, నాసెంట్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ అనే ఐటీ ఉద్యోగుల సంస్థ లేబర్ కమిషనర్‌‌కు ఫిర్యాదు చేసింది. ఏడాది పనిచేసిన ఉద్యోగులను మూడు నెలల ముందు నోటీసు ఇవ్వకుండా తొలగించడం మన దేశ చట్టాలకు విరుద్ధమని, కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఉద్యోగాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని సంస్థ అధ్యక్షులు హర్ప్రీత్ సలౌజా కోరారు. ప్రపంచవ్యాప్తంగా 10వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించడం తెలిసిందే. వీరిలో వందలాది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు,కార్పొరేట్ వర్కర్లు, కింది స్థాయి సిబ్బంది ఉన్నారు. మన దేశంలోనూ వందల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. ఈ నెల 17 నుంచి ఇళ్లకు పంపడం మొదలైంది.