నా తల్లిని తిట్టాడు సార్... అందుకే తల నరికా.. - MicTv.in - Telugu News
mictv telugu

నా తల్లిని తిట్టాడు సార్… అందుకే తల నరికా..

September 29, 2018

కర్ణాటకలో తలలు తెగిపడుతున్నాయి. వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారంటూ ఇద్దరు భర్తలు తమ భార్యల తలలు నరికి  పోలీస్ స్టేషన్లలో లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఆ భయోత్పాతాలను మరవక ముందే మరొకరు.. చిన్న వివాదంలో ఏకంగా తన మిత్రుడి తలనే నరికేశాడు. కర్ణాటకలో నెల వ్యవధిలో తల తెగిపడ్డం ఇది మూడోసారి.

hh

మాండ్యా జిల్లా చిక్కబాగిలు గ్రామానికి  చెందిన పశుపతి(24), గిరీశ్(28) స్నేహితులు. శనివారం వీరికి గొడవైంది. బూతులు తిట్టుకున్నారు. తర్వాత పశుపతి కోపంతో గొడ్డలి తీసుకొచ్చి గిరీశ్ తల నరికాడు. దాన్ని తీసుకుని మలవల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ‘వీడి పేరు గిరీశ్.. నా స్నేహితుడే. కానీ వీడు నా తల్లిని బూతులు తిట్టాడు. అందుకే నరికేశాను.. నన్ను ఏం చేస్తారో చేస్కోండి..’ అని అన్నాడు. పోలీసులు వెంటనే అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. పశుపతి.. చేత్తో తలతో ఊరంతా తిరగడంతో జనం భయాందోళనకు గురై ఇళ్లలోకి వెళ్లి తలుపులు బిగించుకున్నారు. ఈ నెల 11న సతీశ్ అనే వ్యక్తి, గురువారం అజీజ్ సద్దాం అనే వ్యక్తి తమ భార్యల తలలు తీసి పోలీస్ స్టేషన్లలో లొంగిపోయారు.