కలియుగ శ్రీరాముడు.. భార్య మైనపు బొమ్మతో గృహప్రవేశం  - MicTv.in - Telugu News
mictv telugu

కలియుగ శ్రీరాముడు.. భార్య మైనపు బొమ్మతో గృహప్రవేశం 

August 10, 2020

Gautam Buddha Was Born In Nepal...

రాయాయణంలో శ్రీరాముడు రాజసూయ యాగం చేయాలని తలపెడతాడు. భార్యతో కలసి ఆ యాగం చేయాల్సి ఉంటుంది. అయితే సీతను అప్పటికే అడవులకు పంపేసి ఉంటాడు. ఆమె వాల్మీకీ ఆశ్రమంలో ఉంటుంది.. ఈ కథ అంతా మాకు తెలుసులే అని విసుక్కుంటున్నారు కదూ. విషయంలోకి వద్దామిక. సీతకు బదులు రాముడు బంగారంతో సీత విగ్రహాన్ని తయారు చేయించి యాగం పూర్తి చేస్తాడు కదా. సరిగ్గా అలాంటిది ఈ కలికాలంలోనూ జరిగింది. భార్య చనిపోవడంతో  ఓ భర్త ఆమె బొమ్మను తయారు చేయించి గృహప్రవేశం  పూర్తి చేశాడు. 

కర్ణాటకలో కొప్పల్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ గుప్తా తన భార్య భార్య కొన్నేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. అతడు ఇటీవల కొత్త ఇంటిని నిర్మించాడు. గృహప్రవేశంలో భార్య లేని లోటు ఉండకూడదని ఆమె మైనపు విగ్రహాన్ని తయారు చేయించాడు. అచ్చం అతన భార్యను పోలినట్టే ఉన్న విగ్రహాన్ని చూసి చాలామంది చనిపోయిన మనిషి తిరిగొచ్చినట్లు భ్రమపడుతున్నారు. చీర, నగలు, కురులు.. అతి దగ్గరిగా వెళ్లి చూస్తే తప్ప ఆ విగ్రహం అచ్చం మనిషిలాగే కనిపిస్తోంది. శ్రీనివాస్ గుప్తా, అతన కూతుళ్లు బంధుమిత్రులు ఆ బొమ్మతో కలసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.