ఐటీ ఉద్యోగం వదిలేసి గాడిదలు కాస్తున్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఐటీ ఉద్యోగం వదిలేసి గాడిదలు కాస్తున్నాడు..

June 14, 2022

‘చదువుకోకుండా గాడిదలు కాస్తావా?’ ఈ మాట తరచూ తల్లిదండ్రుల నోటినిం వస్తుంటుంది. గాడిదలు కాయడం చీపెస్ట్ పని అనే భావన మనలో లోతుగా ముద్రించుకుపోయింది. అయితే కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయన్నట్లు గాడిదల పెంపకం కూడా డిగ్నిటీ జాబ్‌గా మారింది. ఖరములతో అదేనండి గార్దభాలతో లక్షలు సంపాదిస్తున్న యువకుడే దీనికి నిలువెత్తు అడ్డగాడిద అంత ఉదాహరణ. చేతిలో రూ.17 లక్షల ఆర్లర్డు పెట్టుకున్న అతని కథ అందరికీ స్ఫూర్తిదాయం.


కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ఇరా గ్రామానికి చెందిన శ్రీనివాస గౌడ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఒకరి కింద గాడిద చాకిరీ చేయడం ఇష్టం లేక సొంతంగా ఏదైనా సాధించాలని ఆ ఉద్యోగం వదిలేశాడు. తొలుత మేకలు, కుందేళ్లు, కోళ్లు పెంచాడు. అదంతా ఓల్డ్ బిజినెస్ అనుకుని గాడిదలను ఎంచుకున్నాడు. కొందరు గేలి చేసినా పట్టించుకోలేదు. 2020లో ఇరా గ్రామంలో రెండున్న ఎకరాల స్థలలో పశువుల పెంపక ప్రారంభించాడు. 20 గాడిదలతో డెయిరీ ఫామ్ తెరిచాడు. ఇప్పుడు బిజినెస్ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. గాడిద పాలకు మంచి గిరాకీ ఉండడంతో లక్షలు వస్తున్నాయి. 30 ఎంఎల్ ఖరము పాల ధర రూ. 150 పలుకుతోంది. కాస్మెటిక్స్ కంపెనీలతోపాటు సూపర్ మార్కెట్లకు  గాడిద పాలను సరఫరా చేస్తున్నాడు.