ప్రొఫెసర్ విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. లెసన్స్ చెప్పడం వరకే కాదు జీవిత పాఠాలు బోధించాలి. స్టూడెంట్స్‌కు తానే రోల్ మోడల్లా ఉండాలి. కానీ ఓ ప్రొఫెసర్ లెక్క తప్పాడు. తప్పు అని తెలిసినా ఓ విద్యార్థిని పదే పదే అదే మాట అనేశారు. అలా పిలవొద్దని ఆ విద్యార్థి ఎన్నిసార్లు వేడుకున్నా..మాస్టర్ మారలేదు. చివరకు ఆ విద్యార్థిని టెర్రరిస్టు అని తిట్టిన ప్రొఫెసర్ని తోటి విద్యార్థులు అడ్డంగా బుక్ చేశారు.
ఎంఐటీలో…
మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఓ వీడియో తెగ వైరల్ అయింది. ఇందులో ఓ స్టూడెంట్‌ని టెర్రరిస్టు అంటూ ప్రొఫెసర్ తిట్టిన దృశ్యాలు ఉన్నాయి. ఆడియోతో సహా రికార్డ్ అయింది. ప్రొఫెసర్ తీరుని నెటిజన్లు తప్పు పట్టారు. చివరకు కాలేజ్ మేనేజ్మెంట్ ఈ వీడియోపై స్పందించి సదరు ప్రొఫెసర్ని సస్పెండ్ చేసింది. దీనిపై విచారణకు ఆదేశించింది. ఈనెల 26న ఈ ఘటన జరిగింది.
ఏం జరిగిందంటే…
బెంగళూరు ఎంఐటీలో ఓ ముస్లిం విద్యార్థి ఉండేవాడు. ప్రొఫెసర్ ఇతన్ని తరచుగా టెర్రరిస్టు అని తరుచుగా పిలిచేవారు. పలుమార్లు ఆ విద్యార్థి అలా పిలువొద్దని సార్‌కు చెప్పిచూశాడు. అయినా మాస్టర్ మారలేదు.ఎంత చెప్పినా అలాగే పిలుస్తున్నాడు.”సార్ నేను మీ అబ్యాయి లాంటోడ్ని,నన్ను టెర్రరిస్టు అని పిలవొద్దు. మీకు ఇంతకుముందే చాలా సార్లు చెప్పా.అయినా అలాగే పిలుస్తున్నారు.మీ అబ్బాయిని ఇలాగే పిలుస్తారా? అందరి ముందు టెర్రరిస్ట్ అంటారా? ఇది క్లాస్ రూమ్..నేను స్టూడెంట్, మీరు ప్రొఫెసర్. గౌరవంగా ఉండాలి “అని వాపోయాడు. దీన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో తెగ వైరల్ అయింది. ప్రొఫెసర్ తీరుపై ఎంఐటీ మేనేజ్ మెంట్ స్పందించింది. అతన్ని సస్పెండ్ చేస్తూ విచారణకు ఆదేశించింది.
మేనేజ్మెంట్ రియాక్షన్
ఈ ఘటనపై మణిపాల్ యూనివర్సిటీ డైరెక్టర్ మాట్లాడారు. “ఇలాంటి వాటిని మేం ఉపేక్షించం.ఇక్కడ అన్ని మతాల్ని గౌరవిస్తాం.ప్రపంచమంతా ఒకటే కుటుంబం.ఇలాంటి ఘటనలు మళ్లీ జరగక్కుండా చూసుకుంటాం. ఆ విద్యార్థికి కౌన్సిలింగ్ ఇచ్చాం.కారణమైన ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేశాం”అని డైరెక్టర్ ఎస్పీ కర్ తెలిపారు.