‘నన్ను డిప్యూటీ సీఎంను చేయమ్మా’.. దుర్గమ్మకు మంత్రి లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

‘నన్ను డిప్యూటీ సీఎంను చేయమ్మా’.. దుర్గమ్మకు మంత్రి లేఖ

September 18, 2020

Karnataka Minister B Sriramulu Letter To Durgadevi

కోరుకున్నది నెరవేరాలని దేవుళ్లకు పూజలు చేయడం, మడుపులు కట్టడం సహజం. మనసులో అనుకొని బయటకు చెప్పకుండా దాన్ని నెరవేర్చుకుంటారు. కానీ కర్ణాటకలో మంత్రి మాత్రం భిన్నంగా తన ఆశను బయటపెట్టాడు. ఏకంగా దుర్గా దేవి అమ్మవారుకు లేఖ రాశారు. అందులో తనను డిప్యూటీ సీఎం చేయాలని కోరాడు. దీంతో ఆయన రాసిన ఆ లేఖ వైరల్ కావడంతో అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.  

మంత్రి బి శ్రీరాములు గురువారం కలబుర్గి దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో తన కోర్కెను కాగితంపై రాసి అమ్మవారి పాదాలచెంత పెట్టారు. అది కాస్తా అందరికి తెలిసి పోయింది. దాంట్లో తనను కర్ణాటక ఉప ముఖ్య మంత్రిని చేయాలని ఇది కచ్చితంగా నెరవేర్చాలని కోరాడు. దీంతో ఆయన మనసులో ఉన్న కోరిక బయటపడింది. అయితే ఈ విషయాన్ని నేరుగా అదిష్టానం దృష్టికి వెళ్లేందుకే ఈ కొత్త మార్గం ఎంచుకొని ఉంటారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి ఆయన కోర్కెను బీజేపీ అధిష్టానం నెరవేర్చుతుందో లేదో చూడాలి.