కర్ణాటక మంత్రి పై ఇన్ కంటాక్స్ దాడులు... - MicTv.in - Telugu News
mictv telugu

కర్ణాటక మంత్రి పై ఇన్ కంటాక్స్ దాడులు…

August 4, 2017

 

మంత్రి పై ఐటీ ఉచ్చు బిగిస్తుంది. తన ఆక్రమ సంపాదనను కూకటి వేళ్లతో పీకి వేసే పనిని ఆదాయ పన్ను శాఖ చేస్తుంది. కర్ణాటక ఇంధన మంత్రి డీకే శివకుమార్ కార్యాలయాలు, నివాసం పై ఇన్ కంటాక్స్ శాఖ గత మూడు రోజుల నుంచి డిల్లీ , బెంగళూర్ మెుత్తం 39 చోట్ల ఏక కాలంలో తనిఖీలు చేపట్టారు. గురువారం మరో 23 చోట్ల సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు మెుత్తం రూ .11. 43 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా 300 మంది సిబ్బంది సోదాలలో పాల్గొన్నరట. శివకుమార్ నివాసంలో 5 లాకర్లు ను గుర్తించారు. వీటిలో రెండింటిని తెరవగా మిగత వాటిని శివకుమార్ ఒప్పుకోకపోవడంతో నిపుణుల సాయంతో తెరించేందుకు ప్రయత్నిస్తున్నారట. శివకుమార్ మిత్రుడు విధాన పరిషత్తు సభ్యుడు అయిన రవి ఇంట్లో రూ. 22 కోట్ల విలువచేసే ఆస్తి పత్రాలను గుర్తించారట .

ఈ దాడుల పై కాంగ్రెస్ తీవ్రంగా మడ్డిపడుతుంది. ఇది కేవలం రాజకీయ దాడిగా కాంగ్రేస్ ఆరోపిస్తుంది. ఇది ఇలా ఉంటే గుజరాత్ లో కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బెంగళూర్ కు తరలించారట. శివకుమార్ పర్యవేక్షణలో ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం.