Karnataka minister V Somanna slaps woman at public event, stirs controversy
mictv telugu

మహిళను చెంప దెబ్బ కొట్టిన మంత్రి.. భూమి గురించి అడిగినందుకు..

October 23, 2022

సాయం కోసం వచ్చిన మహిళను కర్ణాటక గృహనిర్మాణ శాఖ మంత్రి వి సోమన్న చెంపదెబ్బ కొట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. తనకు భూమి కేటాయించలేదని ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను రాష్ట్ర మౌలిక వనరుల అభివృద్ధి శాఖ మంత్రి వి.సోమన్న చెంపపై కొట్టారు. కర్ణాటకలోని చామరాజ్ నగర్లో ఈ ఘటన జరిగింది. హంగాల గ్రామంలో చేపట్టిన భూపంపిణీ కార్యక్రమానికి మంత్రి వి.సోమన్న హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుమారు 175 మందికి గ్రామీణ ప్రాంతాల్లో భూ క్రమబద్దీకరణకు ఉద్దేశించిన సెక్షన్‌ 94సీ ప్రకారం టైటిల్‌ డీడ్‌లను పంపిణీ చేశారు.

ఈ క్రమంలో దరఖాస్తు చేసుకున్న ఓ మహిళకు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ పట్టాను ఇవ్వలేదు. ఈ విషయమై వాగ్వాదానికి దిగిన మహిళను మంత్రి చెంప దెబ్బకొట్టారు. అయినా.. సదరు మహిళ మంత్రి కాళ్లకు దణ్నం పెట్టి తన గోడును వెళ్లబోసుకొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తర్వాత మంత్రి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.