ఎమ్మెల్యే నవ్వినందుకు శిక్ష విధించిన జడ్జి - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్యే నవ్వినందుకు శిక్ష విధించిన జడ్జి

March 16, 2019

ప్రజా ప్రతినిధులంటే ఎంతో క్రమశిక్షణగా ఉంటూ నలుగురికి ఆదర్శంగా నిలవాలి. కానీ కొందరు ప్రజాప్రతినిధులు చేసే పనులు చాలా అవమానంగా ఉంటాయి. అలాంటి ఓ సంఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. ఓ ఎమ్మెల్యే చేసిన నిర్వాకం న్యాయమూర్తికి ఆగ్రహం తెప్పించింది.  కర్ణాటకలోని దేవదుర్గకు చెందిన ఎమ్మెల్యే శివనగౌడ నాయక్ ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరై పదే పదే కోర్టు హల్లో నవ్వారు. ఇది గమనించిన న్యాయమూర్తి సదరు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధి అయి ఉండి కోర్టులో ఎలా నడుచుకోవాలో తెలియదా అని చురకలంటించారు. అలాగే సాయంత్రం వరకు కోర్టు కస్టడీలో ఉండాలని ఆదేశించించాడు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే న్యాయవాదులు జోక్యం చేసుకొని న్యాయమూర్తికి ఎమ్మెల్యే చేత క్షమాపణలు చెప్పించి ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాదని చెప్పించి అక్కడినుంచి తీసుకొని వెళ్లారు.