కర్ణాటకలోని మైసూరులో ఉద్రిక్తత నెలకొంది. ఓ చర్చిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి ధ్వంసం చేశారు. బాల ఏసుక్రీస్తు విగ్రహాన్ని కూడా ముక్కలు చేశారు. క్రిస్మస్ వేడుకల ముగిసిన రెండు రోజుల తర్వాత ఈ దాడి జరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పెరియపట్నలోని సెయింట్ మేరీస్ చర్చిపై దాడి జరిగినట్లు అక్కడి సిబ్బంది మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి దుండగులు చర్చి వెనక తలుపును ధ్వంసం చేసి లోనికి వచ్చారని దొంగతనం కోసమా, కేవలం దాడి కోసమా వచ్చారన్నది విచారణలో తేలుస్తామని పోలీసులు చెప్పారు. సంఘటన దృశ్యాలను సీసీ టీవీ ఫుటేజీలో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దుండగులు హుండీని కూడా తీసుకెళ్లినట్టు వెల్లడించారు. క్రైస్తవ మతబోధకులు బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తుండడం, బలవంతంపు మత మార్పిళ్లకు నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.
Miscreants damaged statue of #JesusChrist kept at altar & took money 4m donation box from a #Church in periyapatna #Mysuru. Priest was away when the incident happened.Miscreant,however,didn't damage the main statue of Jesus.We are looking into all the angles: cops #Karnataka pic.twitter.com/5jitzu80GB
— Imran Khan (@KeypadGuerilla) December 28, 2022